: ఇండియన్ సూపర్ లీగ్ లోగో ఆవిష్కరణ
ముంబయిలో ఇండియన్ సూపర్ లీగ్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్, అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్ తదిరులతో పాటు పలువురు క్రీడా రంగ ప్రముఖులు హాజరయ్యారు. ఇండియన్ సూపర్ లీగ్ లో 8 జట్లు పాల్గొంటున్నాయి. అక్టోబరు 12న కోల్ కతాలో తొలి ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ నిర్వహించారు.