: వైసీపీకి వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ రాజీనామా
ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో తాను టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలసిన ఆయన పార్టీలో చేరే విషయంపై చర్చించారు. వైరా నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నానన్నారు. దాంతో, తెలంగాణలో వైసీపీకి పెద్ద షాక్ తగిలిందని పలువురు అంటున్నారు. ఇదిలాఉంటే తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఎండి ఫరీదుద్దీన్, స్వామిచరణ్, బీజేపీ నేత నరేంద్రనాథ్ పలువురు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వారు ముగ్గురూ పార్టీ కండువా కప్పుకున్నారు. వారి చేరికతో మెదక్ లో పార్టీ మరింత పటిష్టపడుతుందని అంటున్నారు.