: స్నేక్ గ్యాంగ్ కు బతికే హక్కులేదు...వారి వెనుక ఎంఐఎం ఉంది: కిషన్ రెడ్డి
ఎందరో యువతుల జీవితాలతో ఆడుకుని, సెటిల్ మెంట్ల పేరిట ఎందరో అమాయకుల కలలను ఛిద్రం చేసి, కాబోయే భర్త కళ్ల ముందే యువతిని సామూహిక అత్యాచారం చేసిన స్నేక్ గ్యాంగ్ సభ్యులకు బతికే హక్కు లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, స్నేక్ గ్యాంగ్ ఆగడాల వెనుక ఎంఐఎం హస్తం ఉందని అన్నారు. ఎంఐఎం అండ చూసుకునే వారీ దారుణాలకు తెరతీశారని ఆయన ఆరోపించారు. జగ్గారెడ్డి తెలంగాణ వాది అన్న సంగతి అందరికీ తెలిసిందేనని, నేతల తీరును ఆయన వ్యతిరేకించారే తప్ప వాదాన్ని ఏనాడూ వదల్లేదని ఆయన స్పష్టం చేశారు.