: వాళ్లు ఒక అమ్మాయిని మతం మారిస్తే మేం వందమందిని మారుస్తాం: సంచలన వీడియో


బీజేపీ ఎంపీ యోగి అదిత్యనాథ్ మాట్లాడారని చెబుతున్న ఓ వీడియో రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడినట్టుగా చెబుతున్న వీడియోలో వాళ్లు ఒక హిందువును ముస్లింలోకి మారిస్తే, మేము వందమంది ముస్లిం అమ్మాయిలను హిందువులుగా మారుస్తామని సవాలు విసురుతారు. వాళ్లు ఒక హిందువును చంపితే మేము... ఆని ఆయన ప్రసంగించిన తీరును చూపించారు. ఈ వీడియో ఇప్పుడు వివాదాస్పదమైంది. దీనిపై ఆయన మాట్లాడుతూ, గతంలో తాను పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలన్నింటినీ కలిపి ఓ వీడియోగా చేసి ఇలా తయారు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. తనపై బురదచల్లే కార్యక్రమంలో భాగంగా ఈ వీడియో తయారుచేశారని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News