: 'ఖడ్గం' చిత్రం ఘర్షణల కేసులను కొట్టివేశారు


దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన 'ఖడ్గం' చిత్రం ప్రదర్శన సందర్భంగా అనంతపురం జిల్లాలోని హిందూపురంలో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులను పన్నెండేళ్ల తర్వాత కోర్టు కొట్టి వేసింది. మొదటి కేసులోని పదిహేను మంది, తర్వాత కేసులోని 36 మంది నిందితులపై ఎలాంటి సాక్ష్యాధారాలు రుజువు కాలేదు. దాంతో, స్థానిక జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి వారిపై కేసులను కొట్టేవేశారు. కేసుల వివరాల్లోకి వెళితే, 2002 డిసెంబర్ 1న 'ఖడ్గం' చిత్రం ప్రదర్శన సమయంలో రెండు వర్గాలుగా ఉన్న కొంతమంది సినిమాలో ప్రజలను కించపరిచేలా కొన్ని మతపరమైన సన్నివేశాలున్నాయంటూ ఘర్షణకు దిగారు. తీవ్ర ఆందోళన చేశారు. పోలీసులు లాఠీచార్జికి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News