: గలాటా, గందరగోళం చేయడానికే వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తున్నారు: మంత్రి బొజ్జల
గలాటా, గందరగోళం చేసేందుకే వైసీపీ సభ్యులు శాసనసభకు వస్తున్నారని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ ఎప్పటికప్పుడు వాయిదా పడడానికి కారణమవుతున్న వైసీపీ సభ్యుల తీరుపై ఆయన మండిపడ్డారు. జగన్ దోచుకున్న లక్ష కోట్లు శాసనసభకు తీసుకువస్తే, ఆ సొమ్ముతో అన్ని రుణాలను వెంటనే మాఫీ చేస్తామని బొజ్జల వ్యాఖ్యానించారు.