: తెలుగు, సాంఘిక శాస్త్రం పాఠ్య ప్రణాళిక సమీక్షకు కమిటీలు ఏర్పాటు


తెలుగు, సాంఘిక శాస్త్రం పాఠ్య ప్రణాళిక సమీక్షకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ రెండు సబ్జెక్టులకు నిపుణులు, అధికారులు, ఉపాధ్యాయులతో వేరు వేరు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సాంఘిక శాస్త్ర కమిటీలో తెలంగాణ రాజకీయ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం, తెలుగుకు సంబంధించిన కమిటీలో చుక్కా రామయ్య, నందిని శిద్దారెడ్డి, దేశపతి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, సాహిత్యం ప్రతిబింబించేలా పాఠ్య పుస్తకాలు ఉండాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది.

  • Loading...

More Telugu News