: బెజవాడ దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ కు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
విజయవాడ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆయన కనకదుర్గ గుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. అసెంబ్లీ చాంబర్ లో మంత్రి దేవినేని ఉమా, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ళ సత్యనారాయణ, కొందరు ఎమ్మెల్యేలు బాబును కలిసి ట్రాఫిక్ సమస్యలు, ఫ్లైఓవర్ అంశంపై వివరించారు. వారి వినతికి సానుకూలంగా స్పందించిన బాబు రూ.250 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.