: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు... వైకాపా ఆందోళనతో పదినిమిషాల పాటు వాయిదా


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ రోజు ప్రారంభమైంది. సభ ప్రారంభమవగానే డ్వాక్రా రుణమాఫీపై వాయిదా తీర్మానాన్ని వైకాపా ఇచ్చింది. డ్వాక్రా రుణాల మాఫీపై చర్చకు వైకాపా సభ్యులు డిమాండ్ చేశారు. అయితే స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు డ్వాక్రా రుణమాఫీపై వైకాపా సభ్యుల వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో ఆగ్రహించిన వైకాపా సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి... ఆందోళన చేయడం మొదలుపెట్టారు. తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని స్పీకర్ రిక్వెస్ట్ చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. దీంతో ఆయన సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News