: రహదారుల వెంబడి సైక్లింగ్ ట్రాక్ ల ఏర్పాటు యోచన చేస్తోన్న కేంద్రం


దేశవ్యాప్తంగా ఉన్న రహదారుల వెంబడి సైక్లింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. శారీరక శ్రమ కరవైన ప్రస్తుత రోజుల్లో సైక్లింగ్ ను ప్రజల జీవన విధానంలో భాగం చేయాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. సైక్లింగ్, వాకింగ్ లాంటివి క్రమం తప్పకుండా చేస్తే 50 శాతం ఆరోగ్యాన్ని అవే కాపాడతాయని ఆయన స్పష్టం చేశారు. హైపర్ టెన్షన్, డయాబెటిస్ లాంటి హెల్త్ డిజార్డర్ లను శారీరక శ్రమ ద్వారా చాలా వరకు అదుపు చేయవచ్చని పేర్కొన్నారు. సైకిల్‌ తొక్కేలా పిల్లల్ని చిన్నప్పటి నుంచి ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. సైక్లింగ్ ట్రాక్ ల ఏర్పాటుపై ఉపరితల రవాణా, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలతో త్వరలో చర్చిస్తానని హర్షవర్ధన్‌ తెలిపారు. దేశంలో సైక్లింగ్‌ను ప్రోత్సహించడంపై ది ఎనర్జీ, రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (టీఈఆర్‌ఐ) అధ్యయన నివేదిక ‘పచ్చని భారతావనికి సైక్లింగ్‌ (పెడలింగ్‌ టువార్డ్స్‌ గ్రీనర్‌ ఇండియా)’ విడుదల సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రకటించారు.

  • Loading...

More Telugu News