: టీమిండియా ఘన విజయం... సత్తా చాటిన రైనా, జడేజా


టెస్టు సిరీస్ లో ఘోర ఓటమి మూటగట్టుకుని తీవ్ర విమర్శల పాలైన టీమిండియా వన్డే సిరీస్ లో మాత్రం జూలు విదిల్చింది. కార్డిఫ్ లో జరిగిన రెండో వన్డేలో ఏకంగా 133 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను మట్టి కరిపించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ధావన్, కోహ్లీలు దారుణంగా విఫలమయ్యారు. అయితే, రైనా (100), రోహిత్ శర్మ (52), ధోనీ (52), రహానే (41)లు విరుచుకుపడటంతో... భారత్ 305 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు 47 ఓవర్లలో 295 పరుగుల లక్ష్యాన్ని (వర్షం అంతరాయం వల్ల) నిర్దేశించారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 38.1 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు తీయగా, షమీ, అశ్విన్ లు చెరో 2 వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, రైనాలు చెరో వికెట్ తీశారు. సురేష్ రైనాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

  • Loading...

More Telugu News