: ఏపీని నాలుగు జోన్లుగా విభజించాలి: శివరామకృష్ణన్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించి అభివృద్ధిని వికేంద్రీకరించాలని రాజధాని కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు చేసింది. ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జోన్లుగా విభజించాలని సూచించింది. విశాఖ నగరం ఇప్పటికే కాస్మోపాలిటన్ నగరంగా ఎదుగుతోందని... దీన్ని హైటెక్ జోన్ గా మలచుకోవచ్చని తెలిపింది. ఐటీ ఆధారిత కంపెనీలను అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పింది. రాయలసీమ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు మధ్యన ఉందని... ఈ జోన్ ను ట్రాన్స్ పోర్ట్ కారిడార్ గా అభివృద్ధి చేసుకోవచ్చని సిఫార్సు చేసింది. శ్రీకాళహస్తిలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర అవసరాలు తీరడమే కాకుండా, ఇతర రాష్ట్రాలతో మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుందని చెప్పింది. కోస్తాంధ్రలో రేవులు, పెట్రో కెమికల్ ఆధారిత సంస్థలను డెవలప్ చేయాలని తెలిపింది.