: మెదక్ లోక్ సభ స్థానానికి 18 నామినేషన్లు
మెదక్ లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు మొత్తం 18 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ తరఫున కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున సునీతా లక్ష్మారెడ్డి, బీజేపీ తరఫున జగ్గారెడ్డి వేసిన నామినేషన్లు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 13న పోలింగ్ జరగనుంది. టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో, ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే.