: కేసీఆర్ గారూ! ఇదేం పని?: జానా లేఖ


మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, వీఐపీలకు భద్రత కుదించడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నేత జానారెడ్డి తప్పుపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. సంఘ విద్రోహశక్తులు, అతివాదుల నుంచి పలువురు నేతలకు ముప్పు ఉందని తెలిసినా భద్రత తగ్గించడం సరికాదని ఆయన హితవు పలికారు. మాజీ మంత్రులు బస్వరాజు సారయ్య, షబ్బీర్ అలీ, శ్రీధర్ బాబు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఎంపీ సుఖేందర్ రెడ్డిలకు భద్రత తగ్గించడం సరికాదని ఆయన లేఖలో పేర్కొన్నారు. తాము అధికారంలో ఉండగా ప్రతిపక్ష నేతలకు కూడా భద్రత కల్పించామని ఆయన గుర్తు చేశారు. తమ అభ్యర్థనను విశాల దృక్పథంతో అర్థం చేసుకోవాలని ఆయన లేఖలో సూచించారు.

  • Loading...

More Telugu News