: మెదక్ విజయం ఎవరిదో తెలుసు... ద్వితీయ, తృతీయ స్థానాలే తేలాల్సింది: హరీష్ రావు


మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ దే విజయమని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మెదక్ లో ప్రభాకర్ రావు నామినేషన్ వేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు తెలియాల్సింది ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించే పార్టీలు ఏవనేవేనని అన్నారు. ఉద్యమాల ఖిల్లా మెదక్ జిల్లా అన్న ఆయన, ఉద్యమకారులపై కేసులు పెట్టించిన వ్యక్తినే ఓ పార్టీ బరిలో దించిందని ఆక్షేపించారు. మేనిఫెస్టోలో చెప్పిన విషయాలనే తాము ఆచరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్లపై పన్నులు రద్దు చేసిన ప్రభుత్వం తమదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News