: టాయిలెట్ నీటితో ఐస్ బకెట్ చాలెంజ్ చేసిన హాలీవుడ్ హీరో


పుర్రెకో బుద్ధి జిహ్వాకో రుచి అన్నారు పెద్దలు...తాజాగా సెలబ్రెటీలను ఊపేస్తున్న ఐస్ బకెట్ ఛాలెంజ్ ఈ విషయాన్ని నిరూపించింది కూడా. ఐస్ క్యూబ్స్ తో బాక్స్ లో నిలబడి కొందరు ఛాలెంజ్ చేస్తే, ఐస్ క్యూబ్స్ బకెట్లో వేసుకుని ఛాలెంజ్ చేశారు. ఐస్ నీళ్లను బకెట్లలో నింపుకుని ఒంటిపై గుమ్మరించుకుని కొందరు ఐస్ బకెట్ ఛాలంజ్ స్వీకరించారు. మంచి నీరు వృధా చేయడం ఇష్టం లేదంటూ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సముద్రం నీటితో ఐస్ బకెట్ ఛాలెంజ్ స్వీకరిస్తే, సోనాక్షిసిన్హా బకెట్ లో ఐస్ వేసుకుని నీటి వృధా అరికట్టాలని పిలుపునిచ్చింది. తాజాగా హాలీవుడ్ హీరో, బోర్న్ ఐడెంటిటీ ఫేమ్ మాట్ డెవిసన్ ఐస్ బకెట్ ఛాలెంజ్ ను వినూత్న రీతిలో స్వీకరించారు. మంచి నీటి ఆదాపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించే డెవిసన్ ఐస్ బకెట్ ఛాలెంజ్ పేరిట మంచి నీటి వాడకంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని, అనేక పేద దేశాల్లో మంచి నీరు విలువైన వస్తువుగా పరిగణించబడుతోందని తెలిపిన ఆయన, టాయిలెట్ నీటి ద్వారా ఐస్ బకెట్ ఛాలెంజ్ విసిరారు. పలు టాయిలెట్ల నుంచి సేకరించిన నీటిని తనపై కుమ్మరించుకుని ఐస్ బకెట్ ఛాలెంజ్ ను తన సహచర నటుడు జార్జ్ క్లూనీ, సంగీత దర్శకుడు బానో, అమెరికన్ ఫుట్ బాలర్ టామ్ బ్రాడీలకు సవాల్ విసిరి ఆదర్శంగా నిలిచాడు.

  • Loading...

More Telugu News