: ఇదో విచిత్రమైన కుంభకోణం... ముగ్గురు టీచర్ల సస్పెన్షన్
గతంలో చాలీచాలని జీతాలతో బతుకీడ్చే ఉపాద్యాయుల జీవితాలను చూసి, బతకలేక బడిపంతులు అనే నానుడి పుడితే... ఇప్పుడు 'బతకనేర్చిన బడి పంతులు' అంటూ కొత్త సామెత పుట్టుకొచ్చింది. దీనిని నిజం చేస్తూ ఓ ముగ్గురు ఉపాధ్యాయులు సరికొత్త కుంభకోణానికి తెరలేపారు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం రాచర్లలో ముగ్గురు ఉపాధ్యాయులు తమకు బదులుగా మరో ముగ్గురిని స్కూలుకి పంపిస్తూ పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నారు. వీరి నిర్వాకంతో ఫిర్యాదులందుకున్న పై అధికారులు తనిఖీకి వెళ్లి, ఫిర్యాదులు వాస్తవం అని నిర్ధారణ కావడంతో వారిని సస్పెండ్ చేశారు.