: సరైన విజయాలు లేకున్నా... ఆర్జనలో రారాజు రోజర్ ఫెదరరే
రోజర్ ఫెదరర్ ఓ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ గెలిచి రెండేళ్లవుతోంది. ఇటీవల కాలంలో చెప్పుకోదగ్గ విజయాలు కూడా పెద్దగా లేవు. అయినా టెన్నిస్ ప్రపంచంలో ఫెదరర్ కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. అందుకే, ఆర్జనలో ఇప్పటికీ రోజర్ ఫెదరరే నెంబర్ వన్ గా ఉన్నాడు. ఫోర్బ్స్ మేగజైన్ ఇటీవల ప్రకటించిన అత్యధిక ధనార్జన గల టాప్-10 టెన్నిస్ క్రీడాకారుల జాబితాలో ఫెదరర్-దే అగ్రస్థానం. గతేడాది జులై నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఫెదరర్ ఆదాయం రూ. 339.40 కోట్లు. దీనిలో సుమారు 90 శాతాన్ని రోలెక్స్, నెక్ వంటి ప్రముఖ వాణిజ్య సంస్థలకు ప్రచారకర్తగా కుదిరిన ఒప్పందాల ద్వారా ఫెదరర్ సంపాదించాడు. ఇక స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ (రూ. 268.80 కోట్లు) రెండో స్థానంలో నిలవగా, జొకోవిచ్ (రూ.199.90 కోట్లు), షరపోవా (రూ.147.30 కోట్లు), లీనా (రూ.142.50 కోట్లు), సెరెనా (రూ.132.80 కోట్లు), ముర్రే (రూ.115.30 కోట్లు), అజరెంకా(రూ.67 కోట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు.