: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పని వేళల్లో మార్పులు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పని వేళల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో రోజుకు ఎనిమిది క్లాసులు నడిచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.