: హైదరాబాద్ లో ప్రతిరోజూ భారీ ఈవెంట్ జరిగేలా తీర్చిదిద్దుతా: కేటీఆర్


తెలంగాణ రాష్ట్రం తయారు చేయనున్న హబ్బుల్లో మరో హబ్ వచ్చి చేరింది. హైదరాబాద్ నగరాన్ని ఫార్మాహబ్ గా, ఐటీహబ్ గా, పర్యాటక హబ్ గా, సినీ హబ్ గా, పారిశ్రామిక హబ్ గా, ఉత్పత్తిరంగం హబ్ గా, హాస్పిటల్ హబ్ గా తీర్చిదిద్దుతామన్న తెలంగాణ మంత్రి కేటీఆర్, తాజాగా, ఈవెంట్ హబ్ గానూ తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో ప్రతిరోజు ఏదో ఒక భారీ ఈవెంట్ జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాలు చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈవెంట్ల నిర్వహణ అనుమతులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామని కేటీఆర్ తెలిపారు.

  • Loading...

More Telugu News