: సీబీఐ కోర్టులో మోపిదేవి పిటిషిన్
జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తనను తప్పించాలని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ నేడు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాన్ పిక్ వ్యవహారంలో సీబీఐ తనను అక్రమంగా ఇరికించిందని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా, వాన్ పిక్ వ్యవహారంలో మోపిదేవి ప్రమేయంపై స్ఫష్టమైన ఆధారాలున్నాయని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అంతేగాకుండా ఆయన పిటిషన్ ను తిరస్కరించాలని కోర్టును కోరింది.