: శీతల పానీయాల్లో చక్కెర శాతం తగ్గించాలని పెప్సీని కోరిన కేంద్రం
పెప్సీ సంస్థ నుంచి మార్కెట్ లోకి వస్తున్న పలు కూల్ డ్రింక్స్ లో చక్కెర శాతాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇటీవల భారత్ పర్యటన నేపథ్యంలో పెప్సీకో చైర్ పర్సన్ ఇంద్ర నూయీ కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మినిస్టర్ హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ను కలిశారు. ఆ సమయంలోనే భారత్ లో తమ భవిష్యత్ ఉత్పత్తుల ప్రణాళికలు, పెట్టుబడుల గురించి ఆమె చర్చించారట. ఆరోగ్య రీత్యా, ఇంకా దేశంలో ఊబకాయం, మధుమేహం బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో... డ్రింక్స్ లో షుగర్ లెవల్ ను తగ్గించాలని పెప్సీని కోరినట్లు సదరు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.