: రాజ్ నాథ్ సింగ్ కు శరద్ యాదవ్ మద్దతు
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు జేడీయూ నేత శరద్ యాదవ్ మద్దతు పలికారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాజ్ నాథ్ సింగ్ కుటుంబంపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. ప్రతిష్ఠ గలిగిన వ్యక్తులపై దుష్ప్రచారం సర్వసాధారణమని ఆయన అభిప్రాయపడ్డారు. పుకార్లతో ప్రతిష్ఠ మసకబారదని, నిజాలు నిగ్గుతేలుతాయని ఆయన స్పష్టం చేశారు. రాజ్ నాథ్ సింగ్ నిప్పులాంటి మనిషని ఆయన తెలిపారు.