: ఇంట్లోంచి లాక్కొచ్చి తల్లిదండ్రుల కళ్లముందే ఆమెను కాల్చేశారు
పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో నేషనల్ డెమాక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ మిలిటెంట్లు ఓ యువతిని ఆమె తల్లిదండ్రుల కళ్లెదుటే కాల్చి చంపారు. అసోం రాష్ట్రంలోని చిరంగ్ జిల్లాలోని ఇండో-భూటాన్ సరిహద్దుల్లోని ద్విముగ్రి గ్రామంలో ప్రియ (16) అనే యువతిని ఇంట్లోంచి బయటకు బరబరా ఈడ్చుకొచ్చి తల్లిదండ్రుల కళ్ల ముందే తుపాకితో తొమ్మిదిసార్లు కాల్చి చంపారు. అనంతరం ఆమె దేహాన్ని పొలాల్లో పడేశారు. రెండు రోజులపాటు గ్రామం వద్ద పొలాల్లో పడి ఉన్న తమ కుమార్తె దేహాన్ని ఆ తల్లిదండ్రులు మిలిటెంట్ల భయంతో స్వాధీనం చేసుకోలేదు.