: నెల్లూరు జిల్లా ఆలయాల్లో దొంగల బీభత్సం
నెల్లూరు జిల్లాలోని మూడు ఆలయాల్లో దొంగలు పెద్ద ఎత్తున చోరీకి పాల్పడ్డారు. మనుబోలు మహావిష్ణు ఆలయం, పొదలకూరు మండలం బత్తలపల్లి నాగవరపు అమ్మవారి ఆలయం, కోవూరు మండలం పాటూరు వేములమ్మ ఆలయంలో దొంగలు ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్ళారు. ఆలయాల అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. దొంగల కోసం గాలింపు చేపట్టారు. చోరీకిగురైన వాటిలో విలువైన పంచలోహ విగ్రహాలు కూడా ఉన్నాయి.