: వైభవంగా ప్రారంభమైన శ్రీకృష్ణదేవరాయల 504వ పట్టాభిషేక మహోత్సవాలు


ఆంధ్రభోజుడుగా కీర్తిగాంచిన శ్రీకృష్ణదేవరాయల 504వ పట్టాభిషేక మహోత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. అనంతపురం జిల్లా పెనుకొండలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ హాజరయ్యారు. ఆయనతోపాటు మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి తదితరులు కూడా ఉత్సవాల్లో పాలుపంచుకున్నారు. ఈ ఉత్సవాలకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో లేపాక్షి దేవాలయం అనే పుస్తకాన్ని బాలకృష్ణ ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News