: జశ్వంత్ సింగ్ ఇంకా కోమాలోనే ఉన్నారు: ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రి
బీజేపీ మాజీ నేత జశ్వంత్ సింగ్ ఇంకా కోమాలోనే ఉన్నారని న్యూఢిల్లీలోని రిసెర్చ్ అండ్ రెఫ్రెల్ ఆర్మీ ఆసుపత్రి వైద్యుడొకరు తెలిపారు. వెంటిలేటర్ సపోర్టుతోనే కొనసాగుతున్నారని, ఆయన పరిస్థితిలో ఎలాంటి ఇంప్రూవ్ మెంట్ లేదని చెప్పారు. అవసరమైన మెడికల్ ట్రీట్ మెంట్ ఇచ్చినప్పటికీ రెస్పాండ్ అవడంలేదని ఆసుపత్రి అధికార ప్రతినిధి ఒకరు వివరించారు. ఈ నెల 8వ తేదీన డెబ్భై ఆరేళ్ల జశ్వంత్ ఇంట్లో కాలు జారిపడిపోవడంతో ఆసుపత్రిలో చేరారు. తర్వాత కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.