: మెదక్ బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డి ఖరారు
బీజేపీ మెదక్ లోక్ సభ అభ్యర్థిగా జగ్గారెడ్డి (అలియాస్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి) పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ ఆయన పేరును ప్రకటించింది. అంతకుముందు హైదరాబాదులోని బీజేపీ కార్యాలయానికి వచ్చిన జగ్గారెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశమై చర్చించారు. రెండు రోజుల నుంచి లోక్ సభ అభ్యర్థిగా పార్టీ తరపున జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ పేర్లను బీజేపీ పరిశీలించింది. ఆఖరికి చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన జగ్గారెడ్డికే బీజేపీ టికెట్ దక్కింది. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన నామినేషన్ వేయనున్నారు.