: బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది: గొల్లపల్లి
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని, రాష్ట్రానికి దశ, దిశ నిర్దేశించేలా ఈ బడ్జెట్ ఉందని టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అన్నారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్న తీరు అభినందనీయమని అన్నారు.