: గన్ మెన్లను కేటాయించాలని దాసరి కోరిన మాట నిజమే: డిప్యూటీ సీఎం చినరాజప్ప


గన్ మెన్లను కేటాయించాలని కేంద్ర మాజీ మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణరావు తనను కోరిన సంగతి నిజమే అని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప స్పష్టం చేశారు. అయితే, గన్ మెన్ల విషయం భద్రతా కమిటీ చూస్తుందని తాను దాసరికి చెప్పానని వెల్లడించారు. అలాగే, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా తమకు భద్రతను పెంచాలని కోరుతున్నారని తెలిపారు. భద్రత ఎవరికి కల్పించాలన్న విషయంలో తన ప్రమేయం ఏమీ ఉండదని చినరాజప్ప స్పష్టం చేశారు. దాసరికి ప్రభుత్వం ఇటీవలే గన్ మెన్లను తొలగించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News