: అమ్మాయిలూ... ఇలాంటి వాళ్లతో డేటింగ్ వద్దు!


స్నేహం కానీ, ప్రేమ కానీ... ఇలా మనసులు పెనవేసుకునే ఏ బంధానికైనా సరే, ఎక్కువగా ప్రభావితమయ్యేది అమ్మాయిలే. ఒకవేళ ఆ బంధం తెగిపోతే అమ్మాయిలే నష్టపోతారన్నది సమాజం చెప్పే వాస్తవం. మగవాళ్ళు నష్టపోవడం చాలా తక్కువ. ఎవరో సున్నిత మనస్కులైతే తప్ప ఇలాంటి బ్రేకప్స్ ను అబ్బాయిలు ఈజీగానే తీసుకుంటున్నారు. అసలీ బ్రేకప్స్ రావాల్సిన పనేముంది? డేటింగ్ కు ముందే జాగ్రత్తలు తీసుకుంటే సరి! అని అంటున్నారు సామాజికవేత్తలు. ఇందుకోసం అమ్మాయిలు ఏం చేయాలో చెబుతున్నారు. * మీరు డేటింగ్ కు ఎంచుకోవాలని భావిస్తున్న అబ్బాయి అనుబంధం బలపడేందుకు కొత్తగా ఏమీ ప్రయత్నించకుండా, అన్నీ ఏకపక్షంగా చర్యలకే ప్రాధాన్యమిస్తుంటే మాత్రం ఇలాంటి వ్యక్తిని దూరం పెట్టాలి. వీరు భవిష్యత్తులో మరింత స్తబ్దుగా తయారయ్యే ప్రమాదం ఉంది. * మీరున్నది వారు తిన్న కంచాలు శుభ్రం చేయడానికని, వారి బట్టలు సిద్ధం చేయడానికని భావిస్తూ, తమను చిన్న పిల్లల్లా ట్రీట్ చేయాలని ఆశించేవారిని అస్సలు దరిచేరనీయొద్దు. * ఎప్పుడూ తాము కొన్న వస్తువుల ధరలు, హోటల్ తిండి ఖర్చులు గురించి పదేపదే ప్రస్తావించే వారితో చాలా కష్టం. డేటింగ్ చేసినన్నాళ్ళూ వీరు మరింత పిసినారితనంతో ప్రవర్తిస్తారన్నదానికి అవి సంకేతాలు. * స్పోర్ట్స్ చూసేందుకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే అబ్బాయిలు... ఓ అనుబంధం పట్ల, కుటుంబం పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఎన్నడూ పట్టించుకోరు. ఇవన్నీ, వారు బాల్య పోకడల నుంచి బయటపడలేదన్న విషయాన్ని సూచిస్తాయి. * అన్నిటికంటే ముఖ్యంగా, ప్రతి క్షణం నిఘా వేసే వ్యక్తికి దూరంగా ఉండాలి. బయటికెళితే ఎవరితో తిరుగుతోంది? ఏం చేస్తోంది? వంటి అనుమానాలతో వేగిపోయే మగవాణ్ణి ఎంతదూరం పెడితే అంతమంచిది. * బంధం పట్ల అవగాహన లేకుండా, చపలచిత్తం ప్రదర్శిస్తుంటారు కొందరు. ఓసారి అనుబంధం కొనసాగించాలని, మరోసారి పిల్లలు కావాలని అంటుంటారు... రెణ్ణెళ్ల తర్వాత, అసలేదీ తేల్చుకోలేకపోతారు. వీరితోనూ జాగ్రత్తగా ఉండాలి.

  • Loading...

More Telugu News