: వాకౌట్ అంటే అర్థం తెలీదా?: యనమల
ఈరోజు (బుధవారం) ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదంటూ వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. తర్వాత కొద్దిసేపటికే వైఎస్సార్సీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తిరిగి సభలోకి వచ్చారు. దీంతో, ఆర్థిక మంత్రి యనమల మాట్లాడుతూ.. వాకౌట్ చేసి తిరిగి సభలోకి ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. వాకౌట్ అంటే అర్థం తెలీదా? అని యనమల ప్రతిపక్ష సభ్యుడికి చురక అంటించారు.