: ఓ ఫుట్ పాత్ వ్యాపారి వినూత్న ఆలోచన


ఓ చిరు వ్యాపారి వినూత్న ఆలోచన ఒక చక్కటి ఆవిష్కరణకు నాంది పలికింది. బెంగళూరులో రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తు (కార్న్)లను విక్రయించే మాదేశ్వరన్ పెద్దగా చదువుకోలేదు. మొక్కజొన్నలను తీసుకురావడం... వాటిని ఒలిచి బొగ్గులపై కాల్చి వేడివేడిగా కస్టమర్లకు అందివ్వడం... ఇదే అతని దినచర్య. ఆదివారం సాయంత్రమైతే అతనికి గిరాకీ ఎక్కువ ఉంటుంది. అయితే, రోజూ మొక్కజొన్న కాల్చేటప్పుడు విసనకర్రతో విసరడం యాభై ఏళ్లు పైబడిన మాదేశ్వరన్ కు కష్టంగా మారింది. రోజూ 5-6 గంటలు అదే పనిగా విసరడంతో చేయినొప్పి బాధించేది. దీంతో, అతను ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలా అని ఆలోచించాడు. ఓ రోజు ఇంట్లో నుంచే అందుకోసం ఓ స్టాండ్ ఫ్యాన్ ను తయారుచేయడం ప్రారంభించాడు. ఇంట్లో వాడే మూతలనే ఫ్యాన్ రెక్కలుగా మలిచాడు. స్టాండుకు ఓ పక్క లైట్ ను, మరో పక్క ఫ్యాన్ ను అమర్చాడు. ఇది బ్యాటరీ సాయంతో పనిచేసే విధంగా రూపొందించాడు. దాన్ని పరీక్షించిన అనంతరం... ఫ్యాన్ చక్కగా పనిచేయడంతో అతను ఆనందానికి అవధుల్లేవు. ఇప్పుడు మాదేశ్వరన్ తన సరికొత్త ఆవిష్కరణతో ఎంచక్కా మొక్కజొన్న పొత్తులను ఆనందంగా అమ్ముతున్నాడు.

  • Loading...

More Telugu News