: మాసాయిపేట దారుణ ఘటనపై రైల్వే శాఖ నివేదిక


నెల క్రితం మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అభం శుభం తెలియని చిన్నారులు పలువురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంపై రైల్వే శాఖ నివేదిక సమర్పించింది. ప్రమాదం జరిగే సమయంలో డ్రైవర్ సెల్ ఫోన్ లో మాట్లాడటం లేదని నివేదిక వెల్లడించింది. రైలు వస్తుందన్న సంగతి డ్రైవర్ కు తెలుసని... అయినా, రైలు వచ్చేలోపల పట్టాలు దాటవచ్చనే అతి విశ్వాసంతో బస్సును ముందుకు పోనిచ్చాడని తెలిపింది. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని వెల్లడించింది. మరో విషయం ఏమిటంటే... కాకతీయ టెక్నో స్కూల్ కు రైల్వే పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. స్కూల్ కు విద్యాశాఖ అనుమతి ఉందని... స్కూల్ బస్ కూడా ఫిట్ గానే ఉందని నివేదికలో పేర్కొన్నారు. త్వరలోనే రైల్వే పోలీసులు ఈ కేసును మూసివేయనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News