: ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో నిరసన జ్వాలలు


తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ కు మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో, ఈ రెండు చోట్ల పార్టీని బలోపేతం చేసుకోవడానికి పార్టీ అధినేత కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో, ఖమ్మం జిల్లా కీలక నేత, టీడీపీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావును టీఆర్ఎస్ లోకి తీసుకోవడానికి (మంత్రి పదవి కూడా ఇస్తున్నారు) సర్వం సిద్ధమైంది. తుమ్మల రాకతో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ బలపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే, తుమ్మల ‘కారు’ ఎక్కుతున్నారన్న వార్తలు... ఆ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ఆగ్రహ జ్వాలలకు కారణమవుతున్నాయి. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన జలగం వెంకట్రావు... కేసీఆర్ నిర్ణయంపై మండిపడుతున్నారు. జిల్లా నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన తనను కాదని... ఎన్నికల్లో టీడీపీ తరపున కనీసం గెలవలేకపోయిన తుమ్మలకు రెడ్ కార్పెట్ ఎలా పరుస్తారని ఆయన ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ కు ఏమాత్రం బలం లేని జిల్లా నుంచి గెలుపొందిన తనకు ఇచ్చే విలువ ఇదేనా? అని జలగం వాపోతున్నారు. వచ్చే నెల తొలి వారంలోనే టీఆర్ఎస్ లో తుమ్మల చేరుతున్నట్టు జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు ప్రారంభంకావడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News