: మంత్రుల పనితీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి... త్వరలోనే కేబినెట్ ప్రక్షాళన


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర మంత్రుల పనితీరు ఏమాత్రం బాగా లేదని ఆయన భావిస్తున్నారు. మంత్రివర్గం ఏర్పడి మూడు నెలలు కావస్తున్నప్పటికీ... కనీసం వారి శాఖలపై కూడా మంత్రులు అవగాహన తెచ్చుకోలేకపోయారని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల పేషీలు కూడా అధ్వానంగానే ఉన్నాయని ఆయన మండిపడుతున్నారు. మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులు, ఓఎస్ డీల వ్యవహారశైలిపై కేసీఆర్ కు అనేక అభ్యంతరాలు అందుతున్నాయి. వారి చాంబర్లలో జరుగుతున్న అపసవ్య ధోరణులు కూడా కేసీఆర్ దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో, కేసీఆర్ తన మంత్రి వర్గంలో భారీ ఎత్తున మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నారు. వచ్చే దసరా లోపల పలువురు మంత్రులకు ఉద్వాసన పలకడమో లేక శాఖలను మార్చడమో చేయవచ్చని తెలుస్తోంది. అంతే కాకుండా పూర్తి స్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరించే పనిలో కూడా ఆయన ఉన్నారు. మంత్రుల పనితీరు బాగాలేకపోతే... ప్రజల్లో విశ్వాసం కోల్పోవాల్సి వస్తుందని గులాబీ అధినేత భావిస్తున్నారు. ఈ క్రమంలో, ప్రజా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కొన్ని చేదు నిర్ణయాలు తీసుకోక తప్పదని నిర్ణయించారు. దీంతో, రానున్న రోజుల్లో తెలంగాణ మంత్రి వర్గంలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.

  • Loading...

More Telugu News