: గంధర్వమహల్ లో 'రభస' షూటింగ్ చేసుకుని బెల్లంకొండ డబ్బులివ్వలేదు: మంచు ఎంటర్టైన్మెంట్
మంచు మోహన్ బాబు కుటుంబానికి చెందిన గంధర్వమహల్ సెట్ లో ‘రభస’ సినిమా షూటింగ్ చేసి చాలా రోజులైనప్పటికీ... ఇంకా తమకు డబ్బులు చెల్లించలేదని మంచు ఎంటర్టైన్మెంట్ సంస్థకు చెందిన ప్రతినిధులు మంగళవారం ఫిలింనగర్ లోని బెల్లంకొండ ఆఫీసు ఎదుట ఆందోళన చేశారు. తమకు బాకీ పడిన సొమ్ము వెంటనే చెల్లించాలని వారు ఆందోళన నిర్వహించారు. అయితే వారి ఆందోళనను నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయంపై మంచు ఫ్యామిలీ ఇంకా స్పందించాల్సి ఉంది. మంచు లక్ష్మి నిర్మాతగా వ్యవహరించిన ‘ఊ కొడతారా...ఉలిక్కిపడతారా’ చిత్రం కోసం గంధర్వమహల్ సెట్ ను నిర్మించారు. భారీ ఖర్చుతో ఈ సెట్ ను కళాత్మకంగా వేశారు. ‘ఊ కొడతారా...ఉలిక్కిపడతారా’ చిత్రం పూర్తయిన తర్వాత ఈ సెట్ ను ఇటీవల కాలంలో బయట సినిమాల షూటింగులకు అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టారు.