: గణేశ్ ఉత్సవాలపై సీపీ మహేందర్ రెడ్డి సమీక్ష
గణేశ్ ఉత్సవాల్లో భద్రతపై పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి సమీక్ష జరిపారు. హైదరాబాదులోని సాలార్ జంగ్ మ్యూజియంలో పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలకు 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. వినాయక మండపాల వద్ద, ఊరేగింపులు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని మహేందర్ రెడ్డి చెప్పారు. జంటనగరాల్లో ప్రతి యేటా వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా గణేశ్ ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.