: చైనాలో తన తలకోసిన వంటవాణ్ని 20 నిమిషాల తర్వాత కాటేసి చంపిన త్రాచుపాము


చైనా దేశంలో ఒక త్రాచుపాము తన తల కోసిన వంటవాణ్ని 20 నిమిషాల తర్వాత కరిచి మరీ చచ్చిపోయింది. చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ వాసులు త్రాచుపాము మాంసంతో చేసిన సూప్ ను చాలా ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా ఇండో చైనీస్ స్పిట్టింగ్ కోబ్రా (దీన్నే థాయ్ కోబ్రా అని కూడా అంటారు) సూప్ అంటే వారికి చాలా ఇష్టం. ఇదే క్రమంలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఒక హోటల్ లో పెంగ్ అనే చెఫ్ ఓ కస్టమర్ ఆర్డర్ మేరకు థాయ్ కోబ్రా సూప్ ను తయారు చేయడం మెుదలుపెట్టాడు. ఈ క్రమంలోనే పామును తీసుకుని జాగ్రత్తగా దాని తలను కట్ చేసి ప్రక్కన పెట్టాడు. ఆ తర్వాత మిగతా భాగంతో సూప్ చేయడం మొదలుపెట్టాడు. సూప్ తయారవుతుండగా... కట్ చేసిన పాము తల భాగాన్ని డస్ట్ బిన్ లో వేద్దామని చేతిలోకి తీసుకున్నాడు. అలా తీసుకున్నాడో లేదో... త్రాచుపాము చటుక్కున కాటువేసింది. ఆసుపత్రికి తరలించేలోపే చెఫ్ మరణించాడు. త్రాచుపాము కాటువేయడంతో హోటల్ కిచెన్ గదిలో దారుణమైన హాహాకారాలు వినిపించాయని... చెఫ్ చనిపోవడంతో... ఆ తర్వాత తాము ఆహారాన్ని కూడా తినలేకపోయామని ఆ సమయంలో ఉన్న కస్టమర్స్ పేర్కొన్నారు. సరీసృపాలు (పాములు సరీసృపాల క్రిందకి వస్తాయి) శరీర భాగాలను కట్ చేసిన తర్వాత కూడా గంట వరకు బతికే ఉంటాయని పాములపై నలభై ఏళ్లుగా పరిశోధనలు చేస్తోన్న యాంగ్ హాంగ్-చాంగ్ అనే శాస్త్రవేత్త చైనా మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News