: రాబోయే కాలంలో రేవంత్ రెడ్డే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అట!
ఏపీ అసెంబ్లీ లాబీలో టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం అసెంబ్లీ లాబీలో పయ్యావుల కేశవ్, తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ సరదాగా ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా పయ్యావుల రేవంత్ రెడ్డి భుజం మీద చేయి వేసి... 'తెలంగాణ టీడీపీ భవిష్యత్తు ఆశాదీపం... టీడీపీ నుంచి కాబోయే తెలంగాణ సీఎం నువ్యే' అంటూ వ్యాఖ్యానించారని మీడియా వర్గాలు అంటున్నాయి. ఇదే సందర్భంలో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండాలని... అలా చేస్తే సీఎం కుర్చీ వైపు అడుగులు తొందరగా పడతాయని పయ్యావుల రేవంత్ కు సూచించారట. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రేవంత్ రెడ్డికి వాగ్ధాటి కలిగిన నేతగా మంచి పేరుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమానమైన వాగ్ధాటి, విభిన్న అంశాలపై పట్టు, రాజకీయ చతురత కలిగిన వ్యక్తిగా రేవంత్ రెడ్డిని రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తుంటారు. అలాగే తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు కావడం రేవంత్ కు భవిష్యత్తులో ప్లస్ అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.