: చంద్రబాబును కలిసిన ఇజ్రాయెల్, జపాన్ రాయబారులు


ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇజ్రాయెల్ రాయబారి డేనియల్, జపాన్ రాయబారి తకేషి యాగి కలిశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెట్టుబడి అవకాశాలను చంద్రబాబు వారికి వివరించారు. నవంబరులో జపాన్ పర్యటనకు రావాలని ముఖ్యమంత్రిని తకేషి యాగి ఆహ్వానించారు. జపాన్ వ్యవసాయం, పర్యాటక రంగం పట్ల చంద్రబాబు ఆసక్తి కనబరిచారు. ఏపీ-జపాన్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, సాధ్యాసాధ్యాలపై ప్రధానంగా చర్చించారు. పోర్టులు, మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ఆసక్తి కనబరుస్తోంది.

  • Loading...

More Telugu News