: లాలూప్రసాద్ యాదవ్ కు రేపు హార్ట్ సర్జరీ!


తీవ్ర అస్వస్థత కారణంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ను సోమవారం నాడు హుటాహుటిన ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌ లో అడ్మిట్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు ఈరోజు (మంగళవారం) బులెటిన్ విడుదల చేశాయి. లాలూ ఆరోగ్యపరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌ మెడికల్ డైరక్టర్ విజయ్ డిసిల్వా తెలిపారు. లాలూకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని... పరీక్షల రిపోర్ట్స్ చూసిన తర్వాత, లాలూకు కార్డియాక్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని గుర్తించామని ఆయన వ్యాఖ్యానించారు. వీలుంటే... లాలూకు రేపే కార్డియాక్ సర్జరీ చేస్తామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News