: దేవీప్రసాద్ కు ఎమ్మెల్సీ ఇవ్వాలనుకుంటున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ని ఎమ్మెల్సీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సంధానకర్తగా దేవీప్రసాద్ సేవలను వినియోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. తొలుత మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున దేవీప్రసాద్ పోటీచేయవచ్చని ఊహాగానాలొచ్చాయి. అయితే, మెదక్ బరిలో ప్రభాకరరెడ్డిని నిలిపిన నేపథ్యంలో... దేవీప్రసాద్ కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం.