: కోల్ కతాలో మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా పుష్పాంజలి
కోల్ కతాలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీలో నోబెల్ అవార్డు గ్రహీత మదర్ థెరిస్సాకు నివాళులర్పించారు. నేడు మదర్ థెరిస్సా 104వ జయంతి సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆమె సమాధి వద్ద పుష్పాంజలి అర్పించారు. కుష్టు రోగులకు సేవ చేసిన మదర్ థెరిస్సా దేశంలో పలు ప్రాంతాల్లో నిర్మల్ హృదయ్ భవన్ లను స్థాపించిన సంగతి తెలిసిందే.