: ఐటీ రంగంలో 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి పల్లె


రానున్న ఐదేళ్లలో ఐటీ రంగంలో 5 లక్షల మందికి ఉద్యోగాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. పెట్టుబడిదారులకు పన్ను రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన పరిమితులు మంజూరు చేయడంలో జాప్యం ఉండదని ఆయన చెప్పారు. కాకినాడలో హార్డ్ వేర్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాదులో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ లోనూ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News