: వావ్... పిల్లలు కూడా నన్ను గుర్తుపట్టేస్తున్నారు: సన్నీ లియోన్
తంతే బూరెల బుట్టలో పడడం అంటే ఇదేనేమో! ఎక్కడో నీలిచిత్రాల్లో నటించే సన్నీ లియోన్ బాలీవుడ్ లో స్టార్ డమ్ దక్కించుకోవడం మామూలు విషయం కాదు. ఇలాంటివన్నీ భారత్ లోనే సాధ్యం! తాజా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ఇండో-కెనడియన్ భామ ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకుంది. భారత్ లో చిన్నచిన్న పట్టణాల్లోనూ తనకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపింది. అంతేగాకుండా, పిల్లలు సైతం తనను గుర్తుపట్టేస్తున్నారని తెగ మురిసిపోయింది. వారి తల్లిదండ్రులు తనను చూసి ఎంతో ఉత్సుకత ప్రదర్శిస్తున్నారని, పిల్లలతో తన ఫొటోలు తీసుకునేందుకు వారు ఆసక్తి చూపుతున్నారని వివరించింది. భారత్ లాంటి వైవిధ్యభరితమైన దేశంలో ఇప్పుడు తానూ ఓ భాగమైనందుకు ఆనందంగా ఉందని ఈ సెక్సీ భామ పేర్కొంది. ఇక్కడ ప్రతిరోజూ ఓ సరికొత్త అనుభవమని అభివర్ణించింది.