: అత్యాచారం చేసిన ఆటో డ్రైవరును అరెస్ట్ చేశారు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కళాశాలకు వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఆ విద్యార్థినిపై డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతడి చెర నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో, పోలీసులు అప్రమత్తమై నిందితుడిని గాలించే పనిలో పడ్డారు. ఘటన జరిగిన గంటలోపే ఆటోడ్రైవరును అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.