: రాష్ట్రంలో మెట్టపంటలు కూడా ఎండిపోతున్నాయి: మంత్రి ఈటెల
తెలంగాణ రాష్ట్రంలో కరవు ఏర్పడిందని, కరవు తీవ్రతతో మెట్టపంటలు కూడా ఎండిపోతున్నాయని రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ప్రతి రోజూ కరవుపై సమీక్ష జరుపుతున్నామని, ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆయన అన్నారు. గత 12 ఏళ్లుగా ఇంత పెద్ద కరవును ఎన్నడూ చూడలేదని ఆయన చెప్పారు. పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించి, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయాలని యోచిస్తున్నామని ఆయన అన్నారు. 2, 3 రోజుల్లో పవర్ హాలిడేపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. దక్షిణాది గ్రిడ్ నుంచి 15 వేల మెగావాట్ల విద్యుత్ ను కేంద్రం అందించాలన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం, రాష్ట్రాల సహకారం ఉండాలని ఈటెల అన్నారు.