: కేరళ గవర్నర్ పదవికి షీలా దీక్షిత్ రాజీనామా
కేరళ గవర్నర్ పదవికి షీలా దీక్షిత్ రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపనున్నారు. నిన్న (సోమవారం) రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలసిన షీలా పదవి నుంచి వైదొలగేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆమె రాజీనామా చేశారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా చాలా ఏళ్లు పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో ఆమెను యూపీఏ ప్రభుత్వం కేరళ గవర్నర్ గా నియమించింది.