: ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈరోజు వైసీపీ సభ్యుల వైఖరితో సభ మూడుసార్లు వాయిదాపడింది. చివరిసారి వాయిదా తర్వాత ప్రారంభమైన సభలో ఎప్పటిలాగే బడ్జెట్ పై మాట్లాడేందుకు తమకు సమయం ఇవ్వాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దాంతో, సమావేశాలు జరిగేందుకు వీలులేకపోవడంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.